Visakhapatnam: బెడ్‌పై వేరే మహిళతో భర్త.. చితకబాదిన భార్య
విశాఖలో వేరే మహిళతో భర్త ఉండటాన్ని భార్య సహించలేకపోయారు...
దిశ, వెబ్ డెస్క్: వేరే మహిళతో భర్త ఉండటాన్ని భార్య సహించలేకపోయారు. ఇద్దరినీ జాయింట్‌గా పట్టుకోవాలనుకున్నారు. ఎక్కడ ఉన్నారనేది పక్కాగా సమాచారం సేకరించారు. బంధువులతో కలిసి ఎటాక్ చేశారు. ఒకే బెడ్‌పై భర్తను, ఆయనతో ఉన్న మహిళను పట్టుకున్నారు. చితకబాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన విశాఖలో జరిగింది.
నగరంలో యువతి, యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు వీరి జీవితం హ్యాపీగా గడిచింది. అయితే భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. స్పాలో పరిచమైన మహిళకు భర్త విలువైన వస్తువులు, బహుమతులు ఇచ్చారు. అలా వీరి మధ్య అక్రమ సంబంధ ఏర్పడింది. దీంతో భార్త ఇంటికి వెళ్లడం మానేశారు. విశాఖ పార్కులు, బీచ్, హోటళ్లలో ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నారు. భర్త ప్రవర్తనలో మార్పు గమనించిన భార్య పక్కాగా నిఘా పెట్టారు. బంధువుల సాయంతో హోటల్లో ఉన్న భర్త జంటను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భర్తను, మహిళను చిత్తక్కొట్టి అక్రమ సంబంధాన్ని గుట్టు రట్టు చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.