టీడీపీలోకి వలసల పర్వంతో కనిగిరి లో వార్ వన్ సైడ్

నియోజకవర్గంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. మంగళవారం సిఎస్ పురం మండలం పెద్ద రాజుపాలెంకు చెందిన 19 కుటుంబాలు,వెలిగండ్ల మండలం కొత్త కండ్రిగకు చెందిన 17 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు.

Update: 2024-03-19 13:49 GMT

దిశ,కనిగిరి:నియోజకవర్గంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. మంగళవారం సిఎస్ పురం మండలం పెద్ద రాజుపాలెంకు చెందిన 19 కుటుంబాలు,వెలిగండ్ల మండలం కొత్త కండ్రిగకు చెందిన 17 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు.కనిగిరి టీడీపీ అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పార్టీలో చేరిన వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అభివృద్ధిని ఆకాంక్షించి ప్రజలందరూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్పు కోరుకుంటున్నారు.జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు,సంక్షేమం ముసుగులో జరుగుతున్న దోపిడీని ప్రజలు గమనిస్తున్నారని, అందుకే ప్రజలు మార్పు కోరుతూ టీడీపీ,జనసేన,బీజేపీ, కూటమితో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

ప్రజాగళం సభలో లక్షలాదిమంది జనం తోసుకొస్తుంటే నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు ఉన్నతాధికారుల పై చీఫ్ ఎలక్షన్ కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని,ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూటమి విజయం ఆపలేరని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.అందుకు తార్కాణం ఈ వలసల పర్వం అని డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి పేర్కొన్నారు.పెదరాజుపాలెంకు చెందిన దర్శి శేషయ్య, మాజీ జెడ్పిటిసి నాగేశ్వరరావు, కే నాగేశ్వరరావు, ధనేంకుల చంద్రయ్య, వెంగయ్య, రాజు, ఆదినారాయణ, జేమ్స్,యేసయ్య, ఓబయ్య,కొత్త కండ్రిగ కు చెందిన సన్నీ పోగు డేవిడ్, సునీత, ఎలమంద, ఆశీర్వాదం, బుజ్జి, విక్టోరియమ్మా, పుల్లయ్య, వెంకటరమణ, సుధాకర్,కోటేష్ తదితరులు పార్టీలో చేరారు.

Read More..

పిఠాపురం నుండే AP దశ మారుస్తా: పోటీపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Tags:    

Similar News