Big Breaking: వాలంటీర్లపై సస్పెన్షన్ వేటు.. అదే కారణమా..?

ఇప్పటికే వైసీపీ ఎన్నిక కోడ్ నిబంధలను పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని వార్తలు వెల్లువెత్తుతున్నాయి.

Update: 2024-03-20 04:48 GMT

దిశ వెబ్ డెస్క్: ఇప్పటికే వైసీపీ ఎన్నిక కోడ్ నిబంధలను పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో యదా రాజా తదా ప్రజా అన్నట్లు పార్టీ ప్రచారాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదని ఎన్నికల సంఘం ఎన్నిసార్లు ఆదేశించిన గ్రామ వలంటీర్లు ఈసీ ఆదేశాలను ఖాతరు చెయ్యలేదు. దీనితో రంగంలోకి దిగిన అధికారులు వాలంటీర్లపై సస్పెన్షన్ వేటు వేశారు.

ఈ ఘటన కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం నియోజకవర్గం, అంబాజీ పేట మండలంలో మూడు గ్రామాల్లో వలంటీర్ల పై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి, నిబంధనలకు విరుద్ధంగా 16 మంది వాలంటీర్లు వైసీపీ పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ  నేపథ్యంలో వైసీపీ పార్టీ ప్రచారంలో పాల్గొన్న 16 మంది వాలంటీర్లను ఎంపిడిఓ లక్ష్మి సస్పెండ్ చేశారు. అలానే సస్పెండ్ అయిన వాలంటీర్లు ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా హెడ్ క్వాటర్స్ నుండి బయటకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ అంశంపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

Read More..

BREAKING: లోక్ సభ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ రిలీజ్  

Tags:    

Similar News