ఏయూ వీసీ ఛాంబర్‌లో జగన్ ఫొటో.. టీఎన్ఎస్ఎఫ్ తీవ్ర ఆగ్రహం

ఏయూ వీసీ ఛాంబర్‌లో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫొటో ఉండటంపై టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఆందోళనకు దిగారు. ...

Update: 2024-06-27 13:31 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏయూ వీసీ ఛాంబర్‌లో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫొటో ఉండటంపై టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఆందోళనకు దిగారు. వెంటనే జగన్ ఫొటో తీసివేయాలని డిమాండ్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోలు పెట్టాలని పట్టుబట్టారు. గత ప్రభుత్వానికి వీసీ అనుకూలంగా వ్యవహరించారని, అందువల్లే జగన్ ఫొటో తీయడంలేదని  టీఎన్ఎస్ఎఫ్ నాయకులు  ఆరోపించారు. వీసీ చాంబర్ ఎదుట బైఠాయించారు. వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు పాత ముఖ్యమంత్రి ఫొటో తీయాలని తమకు సమాచారం ఉందని, ప్రస్తుత ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఫొటో పెట్టాలని తమకు స్పష్టమైన ఆదేశాలు రాలేదని ఏయూ అధికారులు చెబుతున్నారు. పాత సీఎం జగన్ ఫొటోలను ఎప్పుడో తొలగించామని పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో ఎవరి ఫొటోలు, విగ్రహాలు ఉంచాలనేది గవర్నర్ నుంచి ఆదేశాలు రావాలని, తమకు ఇంకా రాలేదని ఏయూ అధికారులు తెలిపారు. 


Similar News