తల్లిదండ్రులకు తీపికబురు.. ఐదుగురు పిల్లలున్నా ఒక్కొక్కరికి రూ. 15 వేలు
తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది...

దిశ, వెబ్ డెస్క్: తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. తల్లికి వందనం(Talliki Vandhanam) పథకాన్ని మే నెలలో అమలు చేస్తున్నట్లు అసెంబ్లీ(Assembly) వేదికగా సీఎం చంద్రబాబు(Cm Chandrababu) స్పష్టం చేశారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పథకం వర్తిస్తుందని వెల్లడించారు. ఐదుగురు పిల్లలున్నా ఒక్కొక్కరికి రూ. 15 వేలు తల్లి ఖాతాలో జమ చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం జనాభాను పెంచాలని తానే చెబుతున్నానని, ఎంతమంది పిల్లలకైనా మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు కూడా ఇస్తామన్నారు. గర్భణీల మృతుల్లో ఆంధ్రప్రదేశ్ 43 స్థానంలో ఉందని చంద్రబాబు తెలిపారు. సిజేరియన్ ఆపరేషన్లు రాష్ట్రంలో బాగా పెరిగాయని, వాటిని నియంత్రించాలని, నార్మల్ డెలివరీలను పెంచాలని, అలాగే మహిళల ఆరోగ్యాన్ని కాపాడాలని మంత్రి సత్యకుమార్‌ను చంద్రబాబు కోరారు.