Tirumala:శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం
వెంకటపాలెం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
దిశ, తిరుమల/అమరావతి: వెంకటపాలెం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి కళ్యాణ వేదిక వద్దకు చేరుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.