శ్రీవారి దర్శనం పేరుతో భక్తురాలికి కుచ్చుటోపీ
టీటీడీ చైర్మన్ జనరల్ సెక్రటరీనని చెప్పి భక్తురాలిని మోసగించిన కేటుగాళ్ల పై తిరుమల టూ టౌన్ లో కేసు నమోదయింది.
దిశ, తిరుమల: టీటీడీ చైర్మన్ జనరల్ సెక్రటరీనని చెప్పి భక్తురాలిని మోసగించిన కేటుగాళ్ల పై తిరుమల టూ టౌన్ లో కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు విజయవాడ సిద్ధార్థ కళాశాల పీజీ విద్యార్థి సంఘమిత్ర కు 5 వీఐపీ బ్రేక్ దర్శనం, 5 సుప్రభాత సేవా టిక్కెట్లు ఇప్పిస్తానని మదలదీపు బాబు, పవన్ కుమార్ లు రూ.2.6 లక్షలు ఫోన్ పే కు వేయించుకొని ఆమె ఫోన్ ను బ్లాక్ చేశారు. తను మోసపోయాను అని గ్రహించిన బాధితురాలు ఫిర్యాదుతో నిందితులు లపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.