Tirumala:శ్రీవారిని దర్శించుకున్న స్టార్ హీరో

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సినీ హీరో నాని దర్శించుకున్నారు.

Update: 2024-08-24 08:05 GMT

దిశ,వెబ్‌డెస్క్:తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సినీ హీరో నాని దర్శించుకున్నారు. ఆయన సినిమా విడుదలకు సిద్దం అవుతుండటంతో చిత్ర బృందంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో నేడు(శనివారం) వేకువజామున అలిపిరి మెట్ల నుంచి కాలినడకన బయలుదేరిన హీరో నాని, చిత్ర బృందం తిరుమలకు చేరుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో ఆయన స్వామి వారిని దర్శించుకున్న అనంతరం నానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆయన నటించిన సరిపోదా శనివారం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలిపిరి మెట్ల మార్గం నుంచి నాని బయలుదేరాడు. స్వామి వారిని దర్శించుకుని హీరో నానిని చూసిన భక్తులు ఆయనతో సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డారు.


Similar News