రెండో రోజు కొనసాగుతోన్న కలెక్టర్ల సదస్సు.. ఆ అంశాలపైనే కీలక చర్చ

వెలగపూడిలోని సచివాలయంలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం (Collectors Conference) కొనసాగుతోంది.

Update: 2024-12-12 07:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: వెలగపూడిలోని సచివాలయంలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం (Collectors Conference) కొనసాగుతోంది. ఈ మేరకు సదస్సులో సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆరు నెలల ప్రభుత్వ ప్రగతి, పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన సంస్కరణలపై ప్రెజెంటేషన్ ఇవ్వాల్సిందిగా పీఆర్ కార్యదర్శి శశిభూషణ్ నియమించారు. రాష్ట్రంలో బోగస్ పెన్షన్లను విచారణ చేపట్టి వెంటనే తొలగించాలని సీఎం చంద్రబాబు, అధికారులను ఆదేశించారు. విధి నిర్వహణలో ఎవరైనా నిర్లక్ష్యం వహించినా.. అవకతవకలు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆర్డర్ వేశారు. అదేవిధంగా నిన్న జరిగిన సదస్సులో రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై విస్తృతంగా చర్చ జరిగింది.

Tags:    

Similar News