Vizag Beach:వైజాగ్ బీచ్‌లో ఒక్కసారిగా వెనక్కి వెళ్లిన సముద్రం..!

ప్రకృతి అందాలను చూస్తు ఆనందంగా గడపాలని అందరికీ ఉంటుంది. ఈ క్రమంలో చాలా మంది టూరిస్ట్ ప్రదేశాలకు వెళ్లి గడుపుతుంటారు.

Update: 2024-08-25 08:36 GMT

దిశ,వెబ్‌డెస్క్:ప్రకృతి అందాలను చూస్తు ఆనందంగా గడపాలని అందరికీ ఉంటుంది. ఈ క్రమంలో చాలా మంది టూరిస్ట్ ప్రదేశాలకు వెళ్లి గడుపుతుంటారు. అయితే బీచ్ లో ఎగసిపడే అలలను చూస్తే పెద్దవాళ్ళు కూడా పిల్లల్లా మారిపోతారు. సరదాగా నీళ్లల్లో ఆడుతూ సేదతీరుతూ ఎంతో సంతోషంగా గడుపుతారు. అయితే అదే అలలు కాస్త వెనక్కి వెళితే అక్కడే నీటి కింది భాగానా ఏం ఉంటుందో తెలుసుకోవచ్చు అనే ఉత్సుకత చాలా మందికి ఉంటుంది. రోజూ నీళ్లలో మునిగి ఉండే తీరం ఇంకాస్త బయటపడితే..? అరుదుగా జరిగే ఇలాంటి సంఘటనే శనివారం సాయంత్రం వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో చోటుచేసుకుంది. ఒక్కసారిగా సముద్రం దాదాపుగా నాలుగు వందల మీటర్లు వెనక్కి వెళ్లింది. దీంతో తీరంలోని రాళ్లు బయటపడ్డాయి. బీచ్ లో సేదతీరేందుకు వచ్చిన జనం ఇది చూసి ఆశ్చర్యపోయారు. ఆపై రాళ్ల పైకి చేరి సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.

 


Similar News