Prakasam Barrage:ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ పూర్తి

ప్రకాశం బ్యారేజీ గేట్లకు ఢీకొన్న పడవల(boats) తొలగింపు పనులు ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే.

Update: 2024-09-21 06:57 GMT

దిశ,వెబ్‌డెస్క్: ప్రకాశం బ్యారేజీ గేట్లకు ఢీకొన్న పడవల(boats) తొలగింపు పనులు ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. ముందుగా ఓ భారీ పడవను(huge boat) ముక్కలు చేయడం ప్రారంభించారు. విశాఖపట్నం(Visakhapatnam) నుంచి వచ్చిన డ్రైవింగ్ బృందం(Driving team) గంటల తరబడి నది లోపల 12 అడుగుల లోతుకి వెళ్లి బోటును గ్యాస్ కట్టర్లతో ముక్కలు చేస్తూ వాటిని తొలగించేందుకు శ్రమించారు.

ఈ క్రమంలో రెండు బోట్లను తొలగించారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రకాశం బ్యారేజీ(Prakasam Barrage) వద్ద చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ విజయవంతమైంది. ఇప్పటికే రెండు బోట్లను(boats) తొలగించిన అధికారులు తాజాగా మూడో పడవను(boats) బయటికి తీశారు. వీటిని పున్నమి ఘాట్‌కు తరలించారు. ఈ ప్రక్రియకు 15 రోజులు శ్రమించాల్సి వచ్చింది. ఈ నెల 1న భారీ ప్రవాహానికి 5 పడవలు బ్యారేజీని ఢీ కొట్టాయి. వాటిలో ఒకటి దిగువకు కొట్టుకుపోగా, మిగతావి గేట్ల వద్ద చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.


Similar News