లడ్డు వివాదంపై టీటీడీ అత్యవసర మీటింగ్.. కీలక నిర్ణయం

ప్రస్తుతం భారత దేశంలో ఎవరి నోట విన్నా.. తిరుమల లడ్డు తయారీ పై చర్చ నడుస్తోంది.

Update: 2024-09-21 07:52 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం భారత దేశంలో ఎవరి నోట విన్నా.. తిరుమల లడ్డు తయారీ పై చర్చ నడుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీలో జంతువుల నుంచి తయారు చేసిన ఆయిల్‌ను ఉపయోగించి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో లడ్డూ ప్రసాదం శాంపిల్స్ తీసుకున్న అధికారులు ల్యాబ్ లో టెస్ట్ చేయింగా.. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యితో పాటు, చేప ఆయిల్ పంది కోవ్వు ఉపయోగించినట్లు స్పష్టం అయింది. దీంతో అప్రమత్తం అయిన అధికారులు చర్యలకు ఆదేశించాలని కొరారు.

కాగా ప్రస్తుతం తిరుమల లడ్డూ వ్యవహారం దేశం మొత్తం పాకడంతో.. లడ్డు వివాదంపై టీటీడీ అత్యవసర సమావేశం నిర్వహించింది. శనివారం మధ్యాహ్నం ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారుల ఈవో భేటీ అయ్యారు. ఆలయ సంప్రోక్షణపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధాన అర్చకులు, పండితులతో టీటీడీ ఈవో చర్చించారు. దీనికి సంబంధించిన నివేదికను సాయంత్రం సీఎం చంద్రబాబు టీటీడీ ఈవో ఇవ్వనున్నారు. అలాగే లడ్డూ అపవిత్రత జరిగిందని తేలడంతో.. ఆగమ,వైదిక, ధార్మిక పరిషత్‌ పెద్దలతో CM చంద్రబాబు భేటీకానున్నారు. అలాగే ఆలయశుద్ధి, సంప్రోక్షణ చేపట్టాలని నిర్ణయం తీసుకోగా.. ధార్మిక పరిషత్‌ పెద్దల సూచనల మేరకు.. ముందుకు వెళ్లాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.


Similar News