Tirupati Prasadam: తిరుపతి లడ్డూ వివాదం పై.. అమూల్ డెయిరీ రియాక్ట్!

ఏపీలో గత కొన్ని రోజులుగా తిరుపతి లడ్డూ ప్రసాదం పై తీవ్ర వివాదం నెలకొంది.

Update: 2024-09-21 08:11 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో గత కొన్ని రోజులుగా తిరుపతి లడ్డూ ప్రసాదం(Tirupati laddu Prasadam)పై తీవ్ర వివాదం నెలకొంది. తిరుపతి వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులకు ఇచ్చే లడ్డూ ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో తయారు చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఆ నెయ్యిని టీటీడీ (TTD)కి.. ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అయిన అమూల్ డెయిరీ(Amul dairy) నే సరఫరా చేస్తుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో అమూల్ డెయిరీ సోషల్ మీడియా వేదికగా 'ఎక్స్'(X) లో స్పందించింది.

తిరుమలకు తాము ఎప్పుడూ నెయ్యి సరఫరా(supply) చేయలేదని స్పష్టం చేస్తూ.. అమూల్ డెయిరీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఐఎస్ఓ(ISO) సర్టిఫికెట్ కలిగిన తమ అత్యాధునిక ఉత్పత్తి కేంద్రాలలో అమూల్ నెయ్యిని స్వచ్చమైన పాలతో మాత్రమే తయారు చేస్తామని తెలిపింది. అంతేకాకుండా తమ డెయిరీల వద్ద సేకరించే పాలు స్వచ్చమైనవని, దీని కొరకు తాము నాణ్యతా ప్రమాణాలు తెలిపే టెస్ట్ లను కూడా చేస్తామని తెలిపింది.కాగా తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వులు ఉన్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.


Similar News