గంజాయి నిర్మూలనకు 100 రోజులు సరిపోవు: ఏపీ డీజీపీ

రాష్ట్రంలో విచ్చలవిడిగా లభ్యమవుతున్న గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు..

Update: 2024-10-18 10:12 GMT

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి(Ganja) రాజ్యమేలుతోంది. పట్టణ, గ్రామం అనే తేడా ప్రతి ఏరియాలోనూ లభ్యమవుతోంది. గంజాయికు బానిసై కొందరు హత్యలకు సైతం వెనకాడటం లేదు. నేరాలు, ఘోరాలు(Crimes and Atrocities) ఇటీవల కాలంలో భారీగా పెరిగిపోయాయి. మరోవైపు యధేచ్ఛగా గంజాయి సరఫరా జరుగుతోంది. ఎక్కడ గంజాయి దొరికినా దాని వెనుక ఏపీ(Ap) మూలాలే కనిపిస్తున్నాయి. ఇటీవల చేపట్టిన పోలీసుల తనిఖీల్లో అత్యధికంగా విశాఖ జిల్లా(Visakha District) నుంచి రవాణా అవుతోన్న గంజాయి పట్టుబడింది. దీంతో గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. గంజాయి కట్టడి కోసం యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్‌(Narcotic Task Force)ను ఏర్పాటు చేశారు. గంజాయి నిర్మూలనకు వంద రోజులు సరిపోవని ఏపీ డీజీపీ తిరుమల రావు కీలక వ్యాఖ్యలు చేశారు. 180 రోజుల్లో కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ ప్రక్రియ పూర్తి అవుతుందని తెలిపారు. పోలీస్ వెల్ఫేర్‌కు ప్రభుత్వం నిధులు ఇస్తుందని ఆశిస్తుందన్నారు. 2019-24 వరకు పోలీసుల సంక్షేమానికి నిధులు ఇవ్వలేదని, ఇప్పుడు ఇస్తారని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్స్ ఎమౌంట్‌ను విడతల వారీగా ఇవ్వాలని తిరుమలరావు కోరారు.


Similar News