Tadipatri: విద్యార్థుల కోసం రోడ్డెక్కిన జేసీ
విద్యార్థుల కోసం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రోడ్డెక్కారు...
దిశ, వెబ్ డెస్క్: విద్యార్థుల కోసం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(Tadipatri Municipal Chairman JC Prabhakar Reddy) రోడ్డెక్కారు. విద్యార్థుల ఫీజుల విషయంలో ఓ ప్రైవేటు కాలేజీ యాజమాన్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కాలేజీ యాజమాన్యం అధిక ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేస్తుందని, సర్టిఫికెట్లు కూడా ఇవ్వకుండా వేధిస్తోందని జేసీ ప్రభాకర్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో విద్యార్థులకు ఆయన మద్దతుగా నిలిచారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి కాలేజీ ఎదుట ధర్నా చేపట్టారు. వెంటనే ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని కాలేజీ ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. యాజమాన్యం తీరుపై మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాలేజీ యాజమాన్యాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు.