‘ఎందుకు గొడవ చేస్తున్నారు?’..ఆ కాలేజీ అమ్మాయిల పై పోలీసుల ఆగ్రహం

గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాల ఘటన పై విద్యార్థినులు ఆందోళన కొనసాగిస్తున్నారు.

Update: 2024-08-31 13:25 GMT

దిశ,వెబ్‌డెస్క్:గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాల ఘటన పై విద్యార్థినులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వారి పై ఓ మహిళ పోలీస్ ఆగ్రహం వ్యక్తం చేయడం విమర్శలకు దారి తీసింది. ‘విచారణ జరుగుతోంది. మీరు ఎందుకు ఇలా గొడవ చేస్తున్నారు. ఎస్పీ అధికారి చెబుతున్నా మీకెందుకు అర్థం కావట్లేదు’ అని పోలీస్ మండిపడ్డారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరుగుతుందని ఎస్పీ అధికారి చెప్పిన మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు. మేము ఇక్కడ మీ కోసమే తిండి తిప్పలు లేకుండా వర్షంలో తడుస్తున్నామని ఆమె చెప్పారు. ఈక్రమంలో అక్కడ ఉన్న అమ్మాయిలు స్పందిస్తూ.. మీకు బాధ్యత లేదా అంటూ ఆ మహిళా పోలీసు అధికారిని ప్రశ్నించారు.


Similar News