Nellore: దాని కోసం రోజుకు కోటి రూపాయలు కర్ఛు చేస్తున్న ఆ జిల్లావాసులు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాను ప్లాస్టిక్ వ్యర్థాలు వనికిస్తున్నాయి.

Update: 2024-05-24 11:20 GMT

దిశ వెబ్ డెస్క్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాను ప్లాస్టిక్ వ్యర్థాలు వనికిస్తున్నాయి. ప్రతి అరకేజీ చెత్తలో సుమారు 150 గ్రా. ప్లాస్టిక్ వ్యర్థాలు ఉంటున్నాయి. ముఖ్యంగా పాలితిన్ కవర్లు నెల్లూరు వాసులను కలవరపెడుతున్నాయి. ఉపయోగించిన పాలితిన్ కవర్లు కొంత మేరకు డంపింగ్‌యార్డుకు చేరుతుంటే ఎక్కువ భాగం సైడ్ కాలవల్లో దర్శనమిస్తున్నాయి.

ప్లాస్టిక్ కవర్లను బ్యాన్ చేసినప్పటికీ వ్యాపారులు మాత్రం యదేశ్చగా ప్లాస్టిక్ కవరుల్లో సరుకును విక్రయిస్తున్నారు. కాగా వ్యాపారులకు రాజకీయనాయకుల అండదండలు మెండుగా ఉండడం ప్లాస్టిక్ నియంత్రనకు ప్రతిబంధంకంగా మారినట్టు సమాచారం. జిల్లా వ్యాప్తంగా 27 లక్షల జనాభా ఉంటే రోజుకి కోటి రూపాయలు విలువచేసే ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, కవర్లు వినియోగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో 10 వేళ కిలోల ప్లాస్టిక్‌ను బయట పడేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సేకరించే వ్యర్థాల్లో ప్రతి అరకేజీ చెత్తలో సుమారు 150 గ్రా. ప్లాస్టిక్ వ్యర్థాలు ఉంటున్నాయి. ముఖ్యంగా నెల్లూరు నగరంలో 9 లక్షల జానాభా ఉంది. ఇక్కడే ఎక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలు పోగవుతున్నాయని అధికారులు తెలిపారు. కాగా కాలవల్లో పేరుకుపోయిన ఈ ప్లస్టిక్‌ను తొలగించడం కష్టంగా మారింది. దీనితో వర్షాలు కురిసినప్పడు ఈ వ్యర్థాలే ముప్పుకు దారితీస్తున్నాయి. 


Similar News