super star krishna మరణవార్త నన్ను కలచివేసింది: చంద్రబాబు
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మరణవార్త నన్ను కలచివేసిందని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మరణవార్త నన్ను కలచివేసిందని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. నానక్ రామ్‌గూడలోని కృష్ణ నివాసానికి వెళ్లన చంద్రబాబు ఆయన పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో పలు రికార్డ్‌లు సృష్టించిన వ్యక్తిని కోల్పోవడం బాధగా ఉందని అన్నారు. తాను చూసిన తొలి సినిమా కృష్ణ నటించిన ''తేనేమననులు'' అని బాబు చెప్పారు. అనంతరం ఘట్టమనేని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మహేష్ బాబు, వారి కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు.