AP News:ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశం..కారణం ఏంటంటే?

రాష్ట్రంలో గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rains) కురిసిన సంగతి తెలిసిందే.

Update: 2024-09-08 02:23 GMT

దిశ,వెబ్‌డెస్క్:రాష్ట్రంలో గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rains) కురిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. పంటపొలాలు, రహదారులు(roads) చెరువులను తలపించాయి. పలు ప్రాంతాల్లో వేలాది ఎకరాల పంట నష్టం జరిగింది. ఇక ఈ భారీ వర్షాల కారణంగా విజయవాడను వరద(Floods) నీరు ముంచెత్తింది. ఇళ్లలోకి వరద(Flood) నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడిప్పుడే వరద నీరు తగ్గుముఖం పడుతుంది అనుకుంటే మళ్లీ రాష్ట్రంలో వర్షాలు(Rains) మొదలయ్యాయి. ఈ క్రమంలో విజయవాడ(Vijayavada)లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి అనిత(Home Minister) ఆదేశించారు. తాడేపల్లిలోని డిజాస్టర్ మేనేజ్‌మేంట్(Disaster Management) కార్యాలయంలో నీటి ప్రవాహం(water flow) పై ఆమె సమీక్షంచారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అంచనా వేసి దానికి అనుగుణంగా మిగిలిన శాఖలను అప్రమత్తం చేయాలని సూచించారు. కాగా, ప్రకాశం బ్యారేజీ(A barrage of light)తో పాటు బుడమేరుకు వరద(Budameru Flood) ప్రవాహం పెరుగుతోందని తెలిపారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.


Similar News