ప్రాణదాతకు వందనం

ఎడతెరపి లేకుండా కురుస్తున్నా వాన

Update: 2024-09-16 15:32 GMT

ప్రాణదాతకు వందనం

ప్రకృతమ్మకు వందనం...

ఇక చాలు అమ్మా

వెళ్లిపోవమ్మా

ప్రాణధాతకు వందనం

ఎడతెరపి లేకుండా కురుస్తున్నా వాన

అరుస్తూనే ఉంది ఆరాం రోజుల నుండి

ఇది నా కాలమంటూ

నాలుగు నెలల అధికారం కాదు

ఇది నా ప్రేమ అంటూ

భూమికి భూమిలో ఉన్నా జీవుల రక్షణకై అంటూ

మేఘాలన్నీ ఒక్కటై భూమిని ముద్దాడి

అవని అంతా సుందరమై పచ్చదనం చేస్తూ

ఆ చెట్లు చెట్ల కొమ్మలు

ఆ కొమ్మలకు పూసినా పూలు

పూలు వికసించి తన సోయగాలతో ఆకర్షిస్తున్నాయి

ప్రకృతంతా మహాద్భుతమై కనువిందు చేస్తున్నాయి.

సృష్టిలోని ప్రతి జీవికి ఊపిరి పోస్తూ

యే తేడాల్లేకుండా అది చీడపురుగునైనా

కరడుగట్టిన విషపుజీవినైనా

అది మల్లెపూవునైనా అదే ప్రేమను పంచుతూ

ఒకే తీరుగా చూస్తుంది.

వాటికి కల్మషం ఉండదు

వాటికి అన్యాయం ఉండదు

వాటికి వివక్షత ఉండదు

మన లాగా కుల మత ఏ అహంకారంలుండవు

స్వేచ్ఛ సమానత్వం తో

మానవత్వం ను పంచుతూ అద్భుతంగా వర్ధిల్లుతుంది.

ఆ ప్రకృతిలోని చెట్లు వేర్లు వాటి మూలమై

ఆ చెట్ల కొమ్మలు రెమ్మలు ఆకులు

వాటి ఆత్మ గౌరవమై

ప్రకృతి లో పూసిన పూలు వాటి సొగసై

ఆ చెట్లు కాయలు పండ్లు వాటి సహజమైన గుణమై

వాటి అందాన్ని వలకబోస్తూ

అద్భుతంగా కనువిందు చేస్తుంది...!

వేసవి కాలం లో ఎండిన అడవికి

పచ్చని రంగులేసి

బహు సుందరత్వాన్ని నెలకొల్పుతుంది.

పక్షుల కిలకిలలు

కప్పల బెకబెకలు అరుపులతో

ప్రకృతి పచ్చదనానికి మరింత వన్నె పూస్తాయి..

రైతుకు బంధువై

వాగులు వంకలు లోయలు ఉప్పొంగుతూ

పచ్చని పైరులకు ప్రాణం పోస్తూ

సృష్టిలోని ప్రతి జీవికి ప్రాణమై

ప్రకృతంతా పరవళ్లు తొక్కుతోంది.

కాడు కు కట్టెలై

ప్రాణం నిలబెట్టడానికి పంటలై

నిత్యం ఆత్మీయతను పంచుతుంది

వాన పాడుగాను అటే పోతుంది అంటూ

లేదా వాన పాడుగాను ఇంకా పోతాలేదు అని

మనిషి ఎన్ని సార్లు నిందించినా

ఎన్ని సార్లు దూషించినా ఎల్లప్పుడూ

ప్రేమను పంచుతునే ఉంటుంది.

అతివృష్టి అనావృష్టి జరిగితే

మనిషి తన మాటలతో ఎంత హింసించినా

అదే ప్రేమను కురిపిస్తోంది ఎల్లప్పుడూ

అది ప్రకృతి యొక్క గొప్పతనం.

కానీ మానవ తప్పిదం వల్ల

కొందరూ చేసే అక్రమాల వల్ల

దుర్బుద్ధి వల్ల వరదల బీభత్సం ఏర్పడి

ఆస్తి మరియు ప్రాణాల నష్టం ఏర్పడుతున్నాయి.

అది మానవ తప్పిదమే అవుతుంది గానీ

ప్రకృతి గుణం ఎలా అవుతుంది...

కరడుగట్టిన స్వార్ధంతో చెలరేగే మనిషి

ఎన్ని విషపు రసాయనాలు పొసినా

ఆ గాయాలను లెక్కజేయకుండా తుడుచుకుంటూ

మళ్ళీ మనల్ని మన తోటి నివసించే

పక్షులు జంతువులను ప్రతి జీవిని

తన ఒడి లో రక్షించడానికే ప్రయత్నిస్తుంటుంది నిత్యం.

ఎంత గొప్ప మనసో కదా

పుట్టినప్పటి నుండి చచ్చేదాకా

తాను తోడు ఉండి

ఒడిలో నిత్యం రక్షించుకుంటుంది.

చచ్చినా శవాన్ని కూడా

తన ఎదలోకే తీసుకొని

తన గొప్ప త్యాగాన్ని

తన గొప్ప ప్రేమను నిరూపించేస్తుంది.

అందుకేనేమో

ఏ కుళ్లు కుట్ర ఏ స్వార్దం తెలియని

సృష్టిలోని ప్రతి జీవికి ప్రాణం పోస్తూ

ఇసుమంతా కూడా అహం లేని ఒడి

ప్రకృతి అంటే శానా ఇష్టం నాకు

స్వచ్ఛ గాలిని ఇచ్చి ఆహ్లాదాన్ని పంచుతుంది కాబట్టి....!!!

అన్ని జీవుల కంటే

మనిషి-ప్రకృతి గొప్ప బాందవ్యం గలదేమో అనిపిస్తుంది.

ఎందుకంటే స్వచ్ఛమైన ప్రకృతి

కలుశితం అయినట్టు

ఈ మానవ సామాజిక వ్యవస్థ లో

కలుశిత కారక జీవులే నెగ్గి

పేరొంద బడుతున్నాయి.

అందుకే ఓ మనిషి...

నీ కరడుగట్టిన స్వార్థంకై

కుట్ర కుళ్లు నటన నరుకుడు

అన్యాయం ఆరాచకం అక్రమంతో

జీవించే జీవన విధానం ను విరమించేసి

నిష్కలంగా స్వచ్ఛతగా జీవించడానికి ప్రయత్నించు..

ప్రకృతి కూడా స్వచ్ఛత గా మారుతుంది.

దేవరాజ్ లింగంపల్లి

కవి, రచయిత

79896 52611


Similar News