ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం..ఇంటి వద్దే "ప్రజా దర్బార్" నిర్వహించిన మంత్రి

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మడ్డిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

Update: 2024-08-24 09:22 GMT

దిశ,ప్రతినిధి: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మడ్డిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చిన్నమండెం మండలం, బోరెడ్డిగారిపల్లెలోని తమ నివాసం వద్ద ప్రజాదర్భార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ..అన్నమయ్య జిల్లాలో ఏ ఒక్కరు సమస్యలతో బాధ పడకూడదనే ఉద్దేశంతో ప్రతిరోజు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఇందులో భాగంగా"ప్రజా దర్బార్" కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి మంత్రి ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం దిశగా సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలు పరిష్కరించాలని వారికి సూచించడం జరుగుతుంది.


Similar News