నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు అస్వస్థత..అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి

ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో చదువుతున్న విద్యార్థులు అనారోగ్యం పాలు అవుతున్న సంఘటనపై రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు.

Update: 2024-08-28 09:00 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో చదువుతున్న విద్యార్థులు అనారోగ్యం పాలు అవుతున్న సంఘటనపై రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు. ట్రిపుల్ ఐటీ కళాశాల అధికారులతో మాట్లాడి సంఘటనకు గల కారణాల పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంస్థలో చదువుతున్న విద్యార్థులు అందరికీ అవసరమైన వైద్య పరీక్షలు చేయించాలని, అనారోగ్యానికి గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి ట్రిపుల్ ఐటీ రిజిస్ట్రార్ ఇతర అధికారులతో మాట్లాడుతూ విద్యార్ధులకు ఏ విధమైన ఇబ్బందులు ఎదురు కాకుండా చూడాలని, వారి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించవద్దుని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సంఘటన పై విచారణ జరిపి సమగ్రమైన నివేదికను తక్షణమే అందించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే నూజివీడు ట్రిపుల్ ఐటీకి వెళ్లి విద్యార్థులకు అందుతున్న వైద్యం, విద్యార్థులు ఎందుకు అనారోగ్యానికి గల కారణాల ఫై ఆరా తీయాలని ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని మంత్రి ఆదేశించారు. మంత్రి ఆదేశాలు మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీమతి సెర్మిష్ట నూజివీడు ట్రిపుల్ ఐటీకి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. కళాశాలలో అపరిశుభ్రత లేకుండా చూడాలని మంత్రి పార్థసారథి గారు ఆదేశించారు.


Similar News