విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిలకులకు గుడ్ న్యూస్.. యాజమాన్యం కీలక ప్రకటన
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు యాజమాన్యం గుడ్ న్యూస్ తెలిపింది..
దిశ, వెబ్ డెస్క్: తమ సమస్యలు పరిష్కరించాలని విశాఖ స్టీల్ ప్లాంట్ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. వేతన సవరణతో పాటు పలు సమస్యలు తీర్పాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరికి 9 కార్మికల సంఘాల నాయకులు కూడా మద్దతు తెలిపారు. అంతేకాదు ఈ పోరాటానికి పలు రాజకీయ పార్టీలు సైతం మద్దతు తెలిపాయి. దీంతో ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు సిద్ధమయ్యారు. కార్మికులందరూ సమ్మెకు వెళ్తామని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అప్రమత్తమైంది. నాన్ ఎగ్జిక్యూటివ్ సిబ్బంది వేతన సవరణకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. స్టీల్ ప్లాంట్ అనుమతి తీసుకుంటామని పేర్కొంది. ఆ తర్వాత వేతన సవరణ అమలు చేస్తామని స్పష్టం చేసింది. అయితే మిగిలిన డిమాండ్లు మాత్రం తమ పరిధిలో లేవని వెల్లడించింది. వేతన సవరణకు తాము సిద్ధంగా ఉన్ననేపథ్యంలో కార్మిక సంఘాల నాయకులు సమ్మెకు వెళ్లొద్దని ప్లాంట్ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. దీంతో ప్లాంట్ యాజమాన్యం చేసిన ప్రకటనపై కార్మికులు చర్చిస్తున్నారు. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.