AP Assembly Elections 2024 : సందిగ్ధానికి తెరతీసిన టీడీపీ అధిష్టానం..?
పరిటాల కుటుంబానికి రెండు ఎమ్మెల్యే సీట్లు ఇస్తారనే సందిగ్ధానికి టీడీపీ అధిష్టానం తెరదించింది. మొదటి అభ్యర్థుల జాబితా విడుదలలో పరిటాల సునీత పేరును రాప్తాడుకు ఖరారు అయింది.
దిశ, రాప్తాడు: పరిటాల కుటుంబానికి రెండు ఎమ్మెల్యే సీట్లు ఇస్తారనే సందిగ్ధానికి టీడీపీ అధిష్టానం తెరదించింది. మొదటి అభ్యర్థుల జాబితా విడుదలలో పరిటాల సునీత పేరును రాప్తాడుకు ఖరారు అయింది. రెండు నెలలుగా రాప్తాడు సీటును బీసీలకు ఇస్తారని అధికార పార్టీ నేతలు ప్రచారం చేశారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో నెలకొన్న అయోమయానికి తెరపడింది. రాప్తాడు సీటు కచ్చితంగా తనకే వస్తుందని ఇప్పటికే గ్రామాల్లో తిరుగుతూ నేరుగా ఇంటింటికీ వెళ్లి టీడీపీ మేనిఫెస్టోను వివరిస్తున్నారు.వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని గెలిచేది తానేనని ఘంటాపథంగా చెబుతున్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వైసీపీ దౌర్జన్యాలతో పాలన సాగించిందనీ విమర్శిస్తున్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత కు నియోజకవర్గంలో దాదాపు ఎక్కడ వ్యతిరేకత కన్పించడం లేదు. ఎక్కడ ఎలాంటి కార్యక్రమం చేపట్టినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేస్తున్నారు.ఇక ధర్మవరం టీడీపీ ఇంచార్జ్ గా ఉన్న పరిటాల శ్రీరామ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేటాయించాలని గట్టిగా పట్టుబడుతున్నారు అయితే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నట్లయితే అక్కడ మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి బీజేపీ తరపున ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రచారం. మరోవైపు పరిటాల సునీత వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఒకవేళ గెలిచినట్లయితే తన మార్కు కుటుంబ పాలన మళ్లీ మొదలవుతుందని ప్రజల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం కూడా నియోజకవర్గంలో ఎవరికైనా పనులు చక్కబెట్టాలంటే ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబంలో ఎవరో ఒకరు రెకమెండ్ చేస్తేనే పని అవుతుందని వైసీపీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Read More..
తుప్పు పట్టిన సైకిల్.. పగిలిపోయిన గ్లాస్ అంటూ ఏపీ మంత్రి సెటైర్స్