‘ది లీడర్ రిటర్న్స్’ అంటూ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం..పక్కా వ్యూహంతో ప్రచారం
కొంతమంది నాయకులు ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చారంటే అది నమ్మాల్సిందే.ఎందుకంటే వారి విజయోత్సవాలు అలానే ఉంటాయి. ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా వరుసగా ఐదు సార్లు గెలిచారంటే వారు కచ్చితంగా ది లీడర్ అని చెప్పాలి.
దిశ, పొన్నూరు: కొంతమంది నాయకులు ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చారంటే అది నమ్మాల్సిందే.ఎందుకంటే వారి విజయోత్సవాలు అలానే ఉంటాయి. ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా వరుసగా ఐదు సార్లు గెలిచారంటే వారు కచ్చితంగా ది లీడర్ అని చెప్పాలి. ఏదో ఒకసారి ఓటమి చెందడం రాజకీయాల్లో సహజమే. ఎన్టీఆర్ ఇందిరా గాంధీ లాంటి వాళ్లే ఓసారి ఓటమి చెందారు.అలా అని వాళ్లు లీడర్ గా లేకుండా పోలేదు.అదే స్థాయిలో పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర ‘ది లీడర్’ గా ఆరోసారి చరిత్రను సృష్టించబోతున్నారనేది పొన్నూరు ప్రజలు బాహాటంగా చెప్తున్నారు.
2019 ఎన్నికల్లో వైసీపీ గాలిలో కిలారి రోశయ్యపై అతి తక్కువ మెజారిటీతో ఓటమి చెందారు. దీంతో ఈసారి నరేంద్ర పక్క వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే ప్రచారాన్ని చేపట్టి తెలుగుదేశం క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. గడపగడపకు తిరుగుతూ వైసీపీ చేసిన అక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలు మరోసారి తప్పు చేయొద్దని ఒక్క అవకాశం ఇస్తే ఎన్నో నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రచారాల్లో ఆయన వివరిస్తున్నారు. ఐదు పర్యాయాలు గెలిపించి ఆరోసారి ఓటమి చెందడం తనకి బాధగా లేదని అయితే ఇది ఒక గుణపాఠం గా భావించి ముందుకు వెళుతున్నానని ప్రజలు విజ్ఞులకు ఓటు వేయాలని కోరుతున్నారు.
అయోమయం లో వైసీపీ క్యాడర్..
పొన్నూరు వైసీపీ కేడర్లో అయోమయం గందరగోళం నెలకొంది. 2019 ఎన్నికల్లో మొదటిసారి వైసీపీ విజయం సాధించింది. కిలారి రోశయ్య వైసీపీ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర పై స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు.కాపు సామాజిక వర్గం రోశయ్య వెంట నడవడం వైసీపీ గాలి లో రోశయ్య బయటపడ్డారని ప్రజలు చెప్పుకుంటున్నారు. అయితే ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య ను పొన్నూరు నుంచి తప్పించి గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం ఆదేశించింది. ఇక్కడ సమన్వయకర్తగా అంబటి మురళిని బరిలో కి దింపింది. దీంతో వైసీపీలో గందరగోళం నెలకొంది.
నరేంద్ర కు కలిసి వచ్చే పరిణామాలు..
వైయస్ రాజశేఖర్ రెడ్డి కాలంలో కాంగ్రెస్ రెండు సార్లు విజయం సాధించిన ఇక్కడ నరేంద్ర ఓటమి చవి చూడలేదు.చాలామంది విశ్లేషకులు చెబుతున్న విషయాలను పరిశీలిస్తే ధూళిపాళ్ల నరేంద్ర పై ఎప్పుడు ఏ పార్టీ స్థానికుడికి కేటాయించకపోవడం ఒక ఒక అంశం అయితే పార్టీలో ఓడిన మరోసారి ఆ అభ్యర్థి నియోజకవర్గంలో కనిపించకపోవడం పరిపాటిగా మారింది. దీంతో అప్పట్లో కాంగ్రెస్ అయినా ఇప్పుడు గెలిచిన వైయస్సార్ పార్టీలో కూడా ఈ విధానం లేకపోవడంతో నరేంద్రకు రాజకీయంగా కలిసి వచ్చే అంశంగా చెప్పుకుంటారు. అయితే ప్రస్తుత పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య మార్చడంపై అనేక అవినీతి ఆరోపణలు ఉండడంతో పాటు ఐప్యాక్ సర్వేలో మొదటిగా ఓడిపోయేది పొన్నూరు స్థానమేనని వైయస్సార్ పార్టీ అధినేతకు నివేదికలు అందాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన కిలారి రోశయ్యను కాకుండా అదే సామాజిక వర్గం చెందిన అంబటి మురళికు అవకాశం కల్పించినట్లుగా తెలుస్తుంది. మురళి కూడా స్థానికేతరుడు కావడం ఈసారి కాపు సామాజిక వర్గం జనసేన వైపు చూస్తుండడంతో ఇక్కడ టీడీపీ విజయం నల్లేరుపై నడకలా సాగుతుందని ఎలాంటి సందేహం లేదని ప్రజలు బాహాటంగా మాట్లాడుకుంటున్నారు. ది లీడర్ రిటర్న్ బ్యాక్ అంటూ టీడీపీ కార్యకర్తలు నాయకులు తమదే గెలుపు అంటూ ధీమా వ్యక్తం చేయడం పై వైసీపీ వ్యూహాలు ఎలా ఉంటాయని రానున్న రోజుల్లో చూడాలి.
Read More..
వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదలకు ముహూర్తం ఫిక్స్.. అక్కడి నుంచే ప్రకటన