Tirumala News:తిరుమలలో బయటపడిన సరికొత్త మోసం..భక్తులే వారి టార్గెట్!

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.

Update: 2024-08-28 08:30 GMT

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఎంతో పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రంలో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో శ్రీవారి భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. లాకర్ల పేరుతో భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే..తిరుమలకు వచ్చి లాకర్లు తీసుకున్న భక్తులకు తిలక్ అనే వ్యక్తి, టీటీడీ ఉద్యోగిగా ఫోన్ చేస్తూ మోసం చేశాడు. లాకర్ నిర్ణీత గడువులోగా ఖాళీ చేయలేదని కాబట్టి ఫైన్ కట్టాలని భక్తులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ మహిళ భక్తురాలికి ఆ వ్యక్తి ఇలాగే కాల్ చేసి బెదిరించడంతో..డౌట్ వచ్చింది. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. దీంతో భక్తులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఈ ఘటనపై పోలీసులు అసలు భక్తుల వివరాలు ఆ వ్యక్తి దగ్గరకు ఎలా వెళ్లాయి, టీటీడీ ఉద్యోగుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. 


Similar News