దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి.. కేవీపీఎస్

దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి... కేవీపీఎస్

Update: 2023-05-30 13:08 GMT

దిశ, ఎమ్మిగనూరు : మండల పరిధిలోని దేవబెట్ట గ్రామంలో దళితుడైన గందాల రాజేష్, గందాల స్వామిదాసులపై కుల ఉన్మాదంతో దాడి చేసి స్వామిదాసు తల పగలగొట్టినవారిపై అట్రాసిటి కేసు నమోదు చేసి, వెంటనే అరెస్ట్ చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యండీ ఆనంద్ బాబు డిమాండ్ చేశారు. మంగళవారం దేవబెట్ట గ్రామంలో కుల అహంకారుల చేతుల్లో దాడికి గురై ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దళిత బాదితులను కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు యస్ దేవసహాయం, జిల్లా ప్రధాన కార్యదర్శి యం డి ఆనంద్ బాబు, జిల్లా ఉపాధ్యక్షులు పి యస్ రాధాకృష్ణ, దళిత నేతలు పరిమర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. దేవబెట్ట గ్రామంలో గత 50 రోజుల క్రితం స్కూల్ పిల్లలు ఏ లే.. అనేపదం అంటే ఏరా.. అని అర్థం వచ్చే పదం రెండు కులాలకు సంబందించిన పిల్లలు వాడారని తెలియజేశారు. మా పిల్లలు అంటే పడాలి తప్పా.. తిరిగి దళితులైన మీ పిల్లలు ఎలా అంటారని ఆరోజే పెద్దలు ఘర్షణ పడ్డారన్నారు.

పిల్లల మాటలకు ఘర్షణ ఎందుకని కలుగజేసుకుని సర్దిచెప్పిన గందాల రాజేష్ పై కక్ష పెంచుకున్న అహంకార వర్గాలు.. నిన్న రాత్రి 7: 20 కు బహిర్భూమికి వెళుతున్న సందర్భంగా అడ్డుకుని దాడి చేశారన్నారు. అన్నపై దాడి చేస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్లిన గంధాల స్వామి దాసును ఏకంగా ఏడు కుట్లు పడేలా తల పగలగొట్టారన్నారు. కరడుగట్టిన కుల అహంకారాన్ని చిన్నపిల్లల నుండే నూరిపోస్తూ దళితులపై విచక్షణ రహితంగా దాడి చేసిన గొల్ల వీరేశు ఉరుకుందప్ప, చిన్న వీరేష్ నాగేంద్రప్ప, ఈరన్న, జగన్నాథ్, నాగేంద్ర, నాగరాజు, దేవేంద్ర, బలరాముడు, వీరేంద్ర, నర్సప్ప, బుడ్డ వెంకటేష్ లపై అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని, దాడిలో గాయపడ్డ స్వామి దాసుకు మెరుగైన వైద్యం అందించాలని లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.

బాదితులను పరామర్శించిన వారిలో కేవీపీఎస్ మండల అధ్యక్షులు చిన్నప్ప, చర్మకార వృత్తి దారుల సంఘం నాయకులు సుమాల రాజు ఉన్నారు. మండల పరిధిలోని దేవబెట్ట గ్రామం లో దళితుడైన గందాల రాజేష్, గందాల స్వామిదాసు లపై కుల ఉన్మాదం తో దాడి చేసి స్వామిదాసు తల పగలగొట్టిన అహంకారులపై అట్రాసిటి కేసు నమోదు చేసి, వెంటనే అరెస్ట్ చేయాలని కెవిపియస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యండి ఆనంద్ బాబు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News