BREAKING: వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై ముగిసిన విచారణ.. హై కోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ

రాష్ట్రంలోని 16 వైసీపీ కార్యాయాలకు అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అనుమతులు లేకుండా పార్టీ ఆఫీసులు

Update: 2024-06-27 11:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని 16 వైసీపీ కార్యాయాలకు అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అనుమతులు లేకుండా పార్టీ ఆఫీసులు నిర్మించారించారని.. ఆ కార్యాలయాలను ఎందుకు కూల్చకూడదో వివరణ ఇవ్వాలంటూ అధికారులు వైసీపీకి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. బుధవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ ముగిసింది. గురువారం ఈ పిటిషన్‌పై విచారణను కంటిన్యూ చేసిన ధర్మాసనం.. ఇరు వర్గాల వాదనలు విన్నది. అనంతరం ఈ పిటిషన్‌పై తీర్పును హై కోర్టు రిజర్వ్ చేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన తీర్పు వచ్చే వరకు వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై స్టేటస్ కో కొనసాగుందని ఆదేశించింది. 16 వైసీపీ కార్యాలయాలకు ఈ స్టే కోటస్ కో వర్తిస్తుందని హై కోర్టు స్పష్టం చేసింది. కాగా,

వైసీపీ కార్యాలయాల కూల్చివేత ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో పలుచోట్ల వైసీపీ కార్యాలయాలను అధికారులు కూల్చివేశారు. మరికొన్ని చోట్ల అనుమతులు లేకుండా నిర్మించారంటూ వైసీపీ ఆఫీస్‌లకు అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనిపై అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ కార్యాలయాలను కూల్చడం, నోటీసులు ఇవ్వడంపై వైసీపీ హై కోర్టును ఆశ్రయించింది. వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి బుధవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాజాగా ఈ కేసు తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో హై కోర్టు జడ్జిమెంట్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


Similar News