అటు హైకోర్టు.. ఇటు ఈసీ.. మధ్యలో జగన్.. తీర్పుపై ఉత్కంఠ
ఎన్నికల సంఘం ఆదేశాలపై ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది..
దిశ, వెబ్ డెస్క్: అటు హైకోర్టు.. ఇటు ఈసీ.. మధ్యలో జగన్.. తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల వేళ సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులను లబ్దిదారుల ఖాతాల్లో జమచేయాలని చూసిన వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున డీబీటీ ద్వారా నిధులు వేసేందుకు ప్రభుత్వం అభ్యర్థనకు ప్రస్తుతం అనుమతించలేమని తెలిపింది. ఎన్నికల తర్వాత లబ్ధిదారులకు నగదు జమ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
అయితే డీబీటీ ద్వారా డబ్బులు విడుదల చేయాలని లబ్ధిదారుల తరపున హైకోర్టులోపిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్‌పై ధర్మాసనం ఎదుట విచారణ జరుగుతోంది. ఎన్నికల సంఘం తరపున వాదనలు వినిపిస్తున్నారు. అటు పిటిషన్ తరపున సైతం వాదనలు కొనసాగుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున డీబీటీ ద్వారా నగదు పంపిణీకి ఈసీ అనుమతి నిరాకరిస్తోంది. నగదు విడుదలకు ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును లబ్ధిదారుల తరపున పిటిషన్ కోరుతున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
Read More..
జైల్లోకి మారువేషంలో వచ్చిన ఆఫీసర్.. చంద్రబాబును చూసి ఏం చేశారంటే..!