గర్భిణులకు, బాలింతలకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

జగన్ ప్రభుత్వం బాలింతలకు, గర్భిణులకు తీపికబురు అందించింది.

Update: 2023-05-11 05:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: జగన్ ప్రభుత్వం బాలింతలకు, గర్భిణులకు తీపికబురు అందించింది. సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ కింద ఇచ్చే పోషకాహారం పంపిణీలో మార్పులు చేయడం జరిగింది. గర్భవతులు, బాలింతలు అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి పోషకాహారాలను తీసుకొచ్చుకునేవారు. ఇప్పుడు వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జూలై 1వ తేదీ నుంచి ఇంటి వద్దకే సరుకులను పంపనున్నారు. కాగా ప్రతి నెలా 1 నుంచి 5వ తారీకుల మధ్య కందిపప్పు, బియ్యం, నూనె, కోడిగుడ్లు, పాలు, రాగిపిండి, అటుకులు, బెల్లం, ఎండు ఖర్జూరా, చిక్కీలు అందజేయనున్నారు. రెండో విడతగా 16, 17 తేదీల్లో పాలు, ఎగ్స్ ఇస్తారు. 

Also Read..

తప్పు మీద తప్పు.. దారితప్పిన సంస్కరణలు 

Tags:    

Similar News