AP Assembly: అసెంబ్లీలో 5 బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
ఏపీ అసెంబ్లీలో ఐదు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది..
దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీలో ఐదు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాలయ చట్ట సవరణ బిల్లుతో పాటు ఆయుర్వేదిక్, హోమియో ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్, మెడికల్ ప్రాక్టీషనర్ బిల్లును ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రవేశపెట్టగా ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లును రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, విద్యుత్ సుంకం చట్ట సవరణ బిల్లును మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రవేశపెట్టారు.
కాగా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా రఘురామరాజును ఏకగ్రీవంగా స్పీకర్ ప్రకటించారు. అటు శాసనమండలి వాడీవేడీగా సాగింది. వైసీపీ సోషల్ మీడియా అరెస్టులపై చర్చించాలని వైసీపీ పట్టుబడ్డింది. ఇందుకు ఫార్మాట్ ప్రకారమే చర్చలు ఉంటాయని చైర్మన్ చెప్పడంతో వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. చైర్మన్ పోడియంను ముట్టడించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స, టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు మధ్య వాదనల వార్ జరిగింది.