రాజధాని పరిధిలోకి మరో రెండు ప్రాంతాలు.. చంద్రబాబు సంచలన నిర్ణయం

రాజధాని పరిధిలోకి బాపట్ల, పల్నాడు ప్రాంతాలను తీసుకొస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది...

Update: 2024-08-02 13:56 GMT

దిశ, వెబ్ డెస్క్: రాజధాని పరిధిలోకి బాపట్ల, పల్నాడు ప్రాంతాలను తీసుకొస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఏపీ రాజధాని అమరావతిని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ, గుంటూరును కలుపుతూ రాజధాని మ్యాప్‌ను రూపొందించారు. ఈ మేరకు కొంత అభివృద్ధి చేశారు. అయితే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలను విభజించింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాను కూడా విభజన చేశారు. అయితే బాపట్ల, పల్నాడును జిల్లా కేంద్రాలుగా చేస్తూ విడివిడిగా రెండు జిల్లాలుగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్స్‌గా ఉన్న బాపట్ల, పల్నాడును రాజధాని పరిథిలోకి తీసుకు వస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాజధాని ప్రాంతంలో బాపట్ల, పల్నాడు ఆధారిటీలు ఉంటాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

Tags:    

Similar News