సీఎం జగన్ పర్యటనల కోసం రెండు హెలికాప్టర్లు
సీఎం జగన్ పర్యటనల కోసం రెండు హెలికాప్టర్లు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది....
దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ పర్యటనల కోసం రెండు హెలికాప్టర్లు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు వాడుతున్న హెలికాప్టర్‌ను మార్చడంతో పాటు మరో దానిని తీసుకోవాలని యోచిస్తోంది. విజయవాడ, విశాఖ పరిధిలో ఈ హెలికాప్టర్లను వినియోగించాలని భావిస్తున్నారు . ఈ మేరకు లీజు పద్ధతిలో 2 హెలికాప్టర్లను తీసుకోవాలని ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ ప్రతిపాదనలు చేసింది. 2010 నుంచి భెల్ హెలికాప్టర్‌ను సీఎం పర్యటనల కోసం వినిగిస్తూ వచ్చారు. అయితే దాన్ని వెంటనే మార్చాలని ఏవీ యేషన్ కార్పొరేషన్ పేర్కొంది. ఇంటెలిజెన్స్ డీజీ, ప్రొటోకాల్ విభాగాల సిఫార్సులతో అత్యాధునిక హెలికాప్టర్లను సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండు ఇంజిన్లు ఉన్న భెల్ హెలికాప్టర్లను లీజుకు తీసుకునేలా గ్లోబల్ వెక్ట్రా కంపెనీతో ఒప్పందం చేసుకునేందుకు ప్రభుత్వ సిద్ధమవుతోంది.