సచివాలయ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ పెంపు
సచివాలయం, హెచ్‌వోడీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది..
దిశ, డైనమిక్ బ్యూరో: సచివాలయం, హెచ్‌వోడీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. హెచ్‌ఆర్‌ఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 16 శాతం హెచ్‌ఆర్‌ఏను 24శాతానికి పెంచింది. 2025 జూన్ వరకు ఇదే కొనసాగుతుందని ఆర్థిక శాఖ కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిపై సచివాలయం ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు సచివాలయం, హెచ్‌వోడీ ఉద్యోగులకు కూటమి నాయకులు హామీ ఇచ్చారు. అధికారంలోకి రావడంతో ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఉద్యోగుల హెచ్‌ఆర్ఏ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హెచ్‌ఆర్‌ఏ పెంచుతూ ప్రకటన విడుదల చేశారు.