ఏపీలో ఫర్నిచర్ వివాదం.. జీఏడీకి మరోసారి లేఖ రాసిన వైసీపీ

ఏపీలో ఫర్నిచర్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది...

Update: 2024-10-03 11:34 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఫర్నిచర్ వివాదం(Furniture Dispute) మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం (Nda Government) అధికారంలోకి వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) ఘోరంగా ఓటమి పాలైంది. అయితే గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయం(Jagan Camp Office)లో ప్రభుత్వ ఫర్నిచర్ ఇప్పటికీ అక్కడే ఉండిపోయింది. ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు. ప్రస్తుతం క్యాంపు కార్యాలయాన్ని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఆఫీసుగా మార్చారు. దీంతో ప్రభుత్వ ఫర్నిచర్ తీసుకెళ్లాలని జీఏడీ(GAD)కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలుమార్లు లేఖ రాసింది.

అయితే అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (YCP General Secretary Lella Appireddy) లేళ్ల అప్పిరెడ్డి మరోసారి లేఖ రాశారు. ఫర్నిచర్‌ను వెంటనే తీసుకెళ్లాలని కోరారు. ఎక్కడికి పంపమంటే అక్కడికి పంపిస్తామని, తీసుకెళ్లడం ఇష్టంలేకపోతే ఖరీదు చెబితే చెల్లిస్తామని లేఖలో తెలిపారు. త్వరగా సమాధానం చెప్పాలని జీఏడీని కోరారు. ఇప్పటికే నాలుగు సార్లు లేఖ రాశామని, కేవలం వైసీపీపై నింద మోపడానికే స్పందించడం లేదా అని ప్రశ్నించారు.


Similar News