Deputy CM Pawan Kalyan :సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డూ(Tirumala Laddu) వివాదం నేపథ్యంలో చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షను నిన్న విరమించిన విషయం తెలిసిందే

Update: 2024-10-03 13:17 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డూ(Tirumala Laddu) వివాదం నేపథ్యంలో చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షను నిన్న విరమించిన విషయం తెలిసిందే. ఈ దీక్ష విరమణ సందర్భంగా నేడు(గురువారం) తిరుపతిలో వారాహి సభ నిర్వహించారు. ఈ సభలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వం పై పవన్ నిప్పులు చెరిగారు. 11 సీట్లకు ఆ భగవంతుడు కుదించిన బుద్ధి రాలేదు అన్నారు. హిందువుగా సనాతన ధర్మాన్ని ఆరాధిస్తా అని పవన్ కళ్యాణ్ తెలిపారు. సనాతన ధర్మాన్ని మట్టిలో కలుపుతా అన్న వారిపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఇస్లాం క్రిస్టియన్ సిక్కు ఇతర మతాలను గౌరవిస్తాం అని పవన్ తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వం చూపించేది సనాతన ధర్మం అని డిప్యూటీ సీఎం తెలియజేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ‘రామతీర్థంలో రాముడి విగ్రహం నరికేశారు. ప్రాయశ్చిత్త దీక్ష చేపడితే అవహేళన చేస్తారు. కొందరు సూడో మేధావులు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు’ అని మండిపడ్డారు. రాముడి విగ్రహావిష్కరణ కార్యక్రమం పై రాహుల్ గాంధీ విమర్శలు చేస్తారని అన్నారు. సనాతన ధర్మాన్ని కొందరు అంతం చేస్తామంటున్నారని డిప్యూటీ సీఎం పవన్ పేర్కొన్నారు.

Tags:    

Similar News