తిరుపతిలో వారాహి డిక్లరేషన్‌ ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతిలో వారాహి డిక్లరేషన్ ప్రకటించారు....

Update: 2024-10-03 12:59 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (AP Deputy CM, Jana Sena chief Pawan Kalyan) తిరుపతిలో వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. తిరుమల లడ్డూ వివాదం(Tirumala Laddu Controversy) నేపథ్యంలో ప్రాయశ్చిత దీక్షను ఆయన విరమించిన విషయం తెలిసిందే. ఈ దీక్ష విరమణ సందర్భంగా తిరుపతిలో వారాహి సభ(Varahi Sabha) నిర్వహించారు. ఈ సభలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి ఎలా అన్నదానిపైనే ఫోకస్‌ పెట్టామని చెప్పారు. పగ, ప్రతీకార రాజకీయాలుండవని గెలవగానే చెప్పామని, దశాబ్దానికి పైగా తనను వ్యక్తిగతంగా తిట్టారని, అవమానించారని గుర్తు చేశారు. తనను ఎంతో పరాభవించారని, అయినా ఎవర్నీ ఏమీ అనలేదన్నారు. వెంకన్నకు అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటామన్నారు. అన్నీ రాజకీయాలేనా.. అన్నీ ఓట్ల కోసమే చేస్తామా అని పవన్‌ ప్రశ్నించారు. 


Similar News