AP News:మత్స్యకారులకు బోట్ ఇంజన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

భీమిలి మండలం పెద్ద నాగమయ్యపాలెంలో రూ.59.40 వ్యయంతో 11 యూనిట్ల పెద్ద బోట్ ఇంజన్లు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం మత్స్యకారులకు అందజేశారు. మత్స్యకారులను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలిపారు.

Update: 2024-10-03 13:34 GMT

దిశ ప్రతినిధి,విశాఖపట్నం: భీమిలి మండలం పెద్ద నాగమయ్యపాలెంలో రూ.59.40 వ్యయంతో 11 యూనిట్ల పెద్ద బోట్ ఇంజన్లు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం మత్స్యకారులకు అందజేశారు. మత్స్యకారులను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలిపారు. పెద్ద బోట్ ఇంజన్లు బిగించడం వల్ల మరింత అధిక మత్స్య సంపద లభిస్తుందని చెప్పారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ బోట్ ఇంజన్లు సమకూర్చిన దివీస్ సంస్థను ఎమ్మెల్యే అభినందించారు. దివీస్ జనరల్ మేనేజర్ ఎం.ఎస్.ఎన్.రావు, సీఎస్ఆర్ మేనేజర్ డి.సురేష్ కుమార్, భీమిలి టీడీపీ అధ్యక్షుడు డి.ఎ.ఎన్. రాజు, జెడ్పీటీసీ గాడు వెంకటప్ప, గరికిన పరుశురాం, శరగడ అప్పారావు, యరబాల అనిల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్.ఓ. ప్లాంట్ ప్రారంభం

ఆనందపురం మండలం గంభీరంలో రూ.13.55 లక్షలతో ఏర్పాటు చేసిన మంచినీటి ఆర్.ఓ.ప్లాంట్ ను కూడా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ ప్లాంట్ వల్ల చుట్టుపక్కల ప్రజలకు రక్షిత మంచినీటి భరోసా లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. దివీస్ సంస్థ ఆర్.ఓ. ప్లాంట్‌‌కు నిధులు సమకూర్చింది. కార్యక్రమంలో గంభీరం సర్పంచ్ వానపల్లి లక్ష్మి, ఈశ్వరరావు, బి.ఆర్.బి.నాయుడు, తాట్రాజు అప్పారావు, పి.అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.


Similar News