అన్నవరం వాగు పై వరద ఉధృతి..పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

ఏపీలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి ఓ గ్రామానికి దగ్గర ఉన్న గుట్టలలో నుంచి వరద రావడంతో బ్రిడ్జిపై నుంచి వరద పోటెత్తింది.

Update: 2024-06-30 10:43 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి ఓ గ్రామానికి దగ్గర ఉన్న గుట్టలలో నుంచి వరద రావడంతో బ్రిడ్జిపై నుంచి వరద పోటెత్తింది. దీంతో మండలానికి, గ్రామాలకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వివరాల్లోకి వెళితే..రేఖపల్లి పంచాయతీ గల అన్నవరం గ్రామం, ఉమ్మడివరం గ్రామం మధ్యలో గల బ్రిడ్జి కూలిపోయింది. ఆదివారం ఉమ్మడివరం గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ..గత రెండు సంవత్సరాలుగా తాము పడుతున్న బాధల గురించి అధికారులకు చెప్పిన ఎవరు పట్టించుకోవట్లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం వచ్చిందంటే తాము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. మండలానికి రావాలంటే వేరే దారులు లేవని ఈ మార్గంలో నుండే ప్రజలు ప్రయాణం చేయాల్సి వస్తుందని అన్నారు.

ఆసుపత్రికి వెళ్లాలన్నఇదే మార్గమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పడిపోయిన బ్రిడ్జి నిర్మించేంతవరకు ప్రజలకు అవసరాల నిమిత్తం నాటు పడవ ఏర్పాటు చేయాలని వారు అధికారులను డిమాండ్‌ చేశారు. గత ఏడాది వరదలకు ఈ బ్రిడ్జి ఒక పక్క కొట్టుకు పోయిందన్నారు. దాన్ని తాత్కాలికంగా మరమ్మతులు చేశారని ఇప్పుడు వరదలు వస్తే ఈ బ్రిడ్జి కూడా కొట్టకుపోయే ప్రమాదం ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వం ఈ బ్రిడ్జిపై ఎలాంటి చర్య తీసుకోలేదని ఈ ప్రభుత్వం అయినా గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని చొరవ చూపాలని గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు.

Similar News