Flood victims:వరద బాధితులకు విరాళాల వెల్లువ.. ఎవరెవరు ఎన్నెన్ని కోట్లు ఇచ్చారంటే?

ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల(Heavy Rains) కారణంగా వరదలు బీభత్సం సృష్టించాయి. ఇక విజయవాడను వరదలు(Vijayawada Floods) ముంచెత్తాయి.

Update: 2024-09-12 14:52 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల(Heavy Rains) కారణంగా వరదలు బీభత్సం సృష్టించాయి. ఇక విజయవాడను వరదలు(Vijayawada Floods) ముంచెత్తాయి. ఇళ్లలోకి వరద(Flood) నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో వరద బాధితులకు భారీగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ సచివాలయంలో నేడు(గురువారం) పలువురు దాతలు సీఎం చంద్రబాబు నాయుడును(CM Chandrababu) కలిసి వ్యక్తిగతంగా, సంస్థల ద్వారా తమ విరాళాలు(Donations) అందజేశారు. ఈ క్రమంలో వరదలతో నిర్వాసితులైన బాధితులకు(Victims) ఆపన్నహస్తం అందించేందుకు పలువురు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం పట్ల సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.

రెడ్డి ల్యాబ్స్ ప్రతినిధి నారాయణ రెడ్డి రూ.5 కోట్లు, కె.ఈ.శ్యామ్ కుమార్ రూ.2 కోట్ల 30 లక్షలు, 3. పెండ్యాల అచ్యుత రామయ్య రూ.2 కోట్లు(ఆంధ్రా షుగర్స్ లిమిటెడ్), విక్రం నారాయణ రావు కుటుంబ సభ్యులు రూ.1 కోటి 55 లక్షలు, ఎం. వెంకటరామరాజు, వసుధ ఫార్మా రూ.1 కోటి, మహేశ్వరరెడ్డి (ఏ.ఎమ్.ఆర్.గ్రూప్) రూ.1 కోటి, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రూ.50 లక్షలు, వై.వి.రామారావు(క్రెడాయ్ ఏపీ) రూ.50 లక్షలు, వెంకట్ అక్కినేని రూ.50 లక్షలు, శివశక్తి ఆగ్రోటెక్ చైర్మన్ నందిగామ శ్రీనివాసరావు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు రూ.50 లక్షలుగా ప్రకటించారు.


Similar News