కీలక పరిణామం.. ఎర్రటి దుస్తులు ధరించి శ్రీకాళహస్తీ ఆలయంలోకి వెళ్లిన మహిళా అఘోరి
శ్రీకాళహస్తి(Srikalahasti)లో గురువారం రోజు మహిళా అఘోరి(Woman Aghori ) నగ్నంగా వచ్చి.. ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్ని, సెక్యూరిటీ అడ్డుకోవడంతో.. ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్: శ్రీకాళహస్తి(Srikalahasti)లో గురువారం రోజు మహిళా అఘోరి(Woman Aghori ) నగ్నంగా వచ్చి.. ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్ని, సెక్యూరిటీ అడ్డుకోవడంతో.. ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. సాంప్రదాయ దుస్తులతో ఎవరు వచ్చినా స్వామి వారి దర్శనం కల్పిస్తామన్న ఆలయ ఈవో బాపిరెడ్డి(Temple EO Bapireddy) తేల్చి చెప్పారు. దీంతో ఆలయ నిబంధనలకు దిగొచ్చిన మహిళా అఘోరి.. ఎర్రటి వస్త్రంతో తన శరీరాన్ని కప్పుకొని.. బందోబస్తు నడుము ఆలయంలోకి ప్రవేశించి.. రాత్రి సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. నగ్నంగానే ఆలయంలోకి వెళ్తానని పట్టుబట్టడంతో అంతకుముందు.. మహిళా అఘోరికి వీడియో కాల్ చేసి దుస్తులు ధరించాలని విశాఖ నాగ క్షేత్రం పీఠాధిపతి(Visakha is the head of the Naga Kshetra) యోగి ప్రభాకర్(Yogi Prabhakar) కోరారు. దీంతో ఆమె ఎర్రటి వస్త్రంతో తన శరీరాన్ని కప్పుకున్నారు.
Read More : అఘోరీ కారుకు ప్రమాదం..శ్రీకాళహస్తి సమీపంలో ఘటన