దేవుడితో ఎనిమిదేళ్ల బాలిక పెళ్లి చేసిన ఆ ఊరి పెద్దలు.. ఎక్కడంటే..?
బాలికను, భాజా భజంత్రీలతో తీసుకొచ్చి ఆలయంలోనే శ్రీవారితో పెళ్లి చేస్తారు.
దిశ, ఫీచర్స్: ఎనిమిదేళ్ల బాలిక పెళ్లిని ఎవరూ అడ్డుకోలేక పోతున్నారు. ఇది వేద పండితుల మంత్రోచ్ఛారణ. విచిత్రమైన ఆచారంతో శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామితో, ఎనిమిదేళ్ల బాలిక వివాహం జరిపిస్తున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా 8 ఏళ్ల బాలికతో శ్రీవారి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీ.
అరవ కుటుంబానికి చెందిన వారసులు 80 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అరవ వంశానికి చెందిన ఎనిమిదేళ్ల బాలికకు శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామితో సంప్రదాయబద్ధంగా వివాహం జరిగింది. బాలికను, భాజా భజంత్రీలతో తీసుకొచ్చి ఆలయంలోనే శ్రీవారితో పెళ్లి చేస్తారు. ఇలా వివాహం చేస్తే ప్రతి సంవత్సరం పెళ్లి చేసుకున్న బాలికకు మంచి భర్త లభిస్తాడని స్థానికుల నమ్మకం. పూజారులు బాలిక మెడలో మంగళసూత్రాన్ని తాకి, శ్రీవారి ప్రక్కన ఉన్న పద్మావతి దేవి ఉత్సవ విగ్రహానికి పసుపు కొమ్ముకు కడతారు.
తరువాత, అమ్మాయి తల్లి మెడలో మంగళసూత్రం కట్టడంతో వివాహం ముగుస్తుంది. ప్రతి సంవత్సరం, అరవ వంశానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామిని వివాహం చేసుకోవడం ఒక సాంప్రదాయంగా వస్తుంది.