Gas Leakage : కర్పూర పరిశ్రమలో గ్యాస్ లీకేజ్.. ఆరుగురి పరిస్థితి విషమం

ఏపీ(AP)లో మరో పరిశ్రమలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

Update: 2024-11-01 13:34 GMT
Gas Leakage : కర్పూర పరిశ్రమలో గ్యాస్ లీకేజ్.. ఆరుగురి పరిస్థితి విషమం
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లో మరో పరిశ్రమలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లాలోని శింగనమల మండలంలో కర్పూర పరిశ్రమలో విషవాయువులు లీకయ్యాయి(Gas Leakage). ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు స్పృహ కోల్పోయారు. శుక్రవారం మద్యాహ్నం పరిశ్రమలోని రియాక్టర్లను శుభ్రం చేస్తుండగా.. ఒక్కసారిగా గ్యాస్ లీకైంది. దీంతో రియాక్టర్ శుభ్రం చేస్తున్న కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురై అక్కడిక్కడే పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన యాజమాన్యం తోటి కార్మికుల సహాయంతో వారిని బయటికి తీసుకు వచ్చారు. కొంతమంది కార్మికులు భయపడి బయటికి పరుగులు తీశారు. అపస్మారకస్థితిలో ఉన్న కార్మికులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.    

Tags:    

Similar News