ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. 20 మంది వైసీపీ నేతల గన్‌మెన్ల తొలగింపు

రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం వైసీపీ నేతలకు షాక్ ఇచ్చింది.

Update: 2024-02-27 13:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం వైసీపీ నేతలకు షాక్ ఇచ్చింది. కడప జిల్లాకు చెందిన 20 మంది వైసీపీ నేతలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన గన్‌మెన్లను తొలగిస్తూ.. ఈజీ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి అపాయం ఉన్న నేతలకు ప్రభుత్వం గన్‌మెన్లను రక్షణ కోరకు ఇస్తుంది. అయితే వైసీపీ ప్రభుత్వం నేతలకు భద్రత కల్పించే విషయంలో వివక్ష చూసుతొందని.. ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఆ ఫిర్యాదులో వైసీపీ ప్రభుత్వంలోని నేతలకు 4+4 గన్‌మెన్లను ఇచ్చారని, ప్రతిపక్ష నాయకులకు మాత్రం 1+1 గన్‌మెన్లను కేటాయించారని తెలిపారు. ఈ పిర్యాదుపై స్పందించిన ఈసీ.. విచారణ అనంతరం.. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు పంపింది. రూల్స్ కు విరుద్దంగా 20 మంది వైసీపీ నేతలకు కేటాయించిన గన్‌మెన్లను తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

Read More..

పోలింగ్ కేంద్రాలకు కనీస వసతులు కల్పించండి: జాయింట్ కలెక్టర్

Tags:    

Similar News