వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదలకు ముహూర్తం ఫిక్స్.. అక్కడి నుంచే ప్రకటన
రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు...
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో సీఎం జగన్ జగన్ మోహన్ రెడ్డి అలర్ట్ అయ్యారు. ఇప్పటివరకూ పార్టీ ఇంచార్జుల ప్రకటించిన ఆయన ఇప్పుడు అభ్యర్థుల జాబితాపై పెట్టారు. మొత్తం 175 స్థానాల్లో వైసీపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను రెడీ చేశారు. అంతేకాదు ప్రకటించేందుకు కూడా సిద్ధమయ్యారు. అటు ఎన్నికల ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టనున్నారు. అభ్యర్థుల ఫస్ట్ జాబితా విడుదల చేసి ఆ తర్వాత ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు.
ఈ నెల 16న వైసీపీ అభ్యర్థుల జాబితాను సీఎం జగన్ ప్రకటించనున్నారు. తండ్రి రాజశేఖర్ రెడ్డి స్వగ్రామమైన ఇడుపలపాయ నుంచి ఈ జాబితాను విడుదల చేయనున్నారు. ఈ నెల 18నుంచి ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల నుంచి ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. 175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించేలా వైసీపీ శ్రేణులు, పార్టీ కేడర్‌కు ఇప్పటికే దిశా నిర్దేశం చేశారు.
Read More..