ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
ఏపీలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది.
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల స్థానానికి సన్నారెడ్డి దయాకర్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. అలాగే కడప-అనంతపురం-కర్నూలు స్థానానికి నగరూరు రాఘవేంద్ర, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నానికి పీవీఎన్ మాధవ్‌ను ఎంపిక చేసింది. అయితే మిగిలిన రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇకపోతే రాష్ట్రంలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 13న జరగనున్నాయి. మార్చి 16న ఫలితాలు వెల్లకానున్నాయి.