విజయవాడలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా మారిన బైకుల దగ్ధం.. అతడికి ఎందుకంత కోపం?

విజయవాడలో బైకుల దగ్ధం ఘటన సస్పెన్స్ థ్రిల్లర్‌గా మారింది...

Update: 2025-01-03 04:24 GMT

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ (Vijayawada)లో బైకు(Bykes)ల దగ్ధం ఘటన సస్పెన్స్ థ్రిల్లర్‌గా మారింది. అర్ధరాత్రి వీధుల్లో తిరుగుతూ ఓ వ్యక్తి బైకులను దగ్ధం చేస్తున్నారు. ఇంటి ముందున్న బైకులే టార్గెట్‌గా నిప్పు పెట్టి వెళ్లిపోతున్నారు. గురువారం ఒంటి గంటన్నర సమయంలో ఘటన విజయవాడ నగరంలో కలకలం రేపింది.

భవానీపురం(Bhavanipuram)లో రాత్రి సమయంలో ఓ వ్యక్తి సంచారం చేశారు. చేతిలో సంచితో ఉన్న సదరు వ్యక్తి సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చి పార్క్ చేసి ఉన్న బైకులకు నిప్పంటించారు. అనంతరం సడీచప్పుడు లేకుండా అక్కడి నుంచి జారుకున్నారు. నెల రోజులుగా విజయవాడ నగరంలో ఇదే తరహా ఘటనలు జరుగుతున్నాయి. భవానీపురంలో జరిగిన ఘటనలో స్థానిక సీసీ టీవీ పుటేజుల్లో వ్యక్తి దగ్ధం చేస్తున్న దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపించాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.

అయితే ‘‘ఆ వ్యక్తి ఎవరు..?, ఎందుకు బైకులకు నిప్పు పెడుతున్నారు?, అసలు బైకులపై ఎందుకంత కోపం?, బైకుల వల్ల తానేమైనా నష్టపోయారా?, అందుకే ఇలా చేస్తున్నారా’’ అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. 

Tags:    

Similar News