జగన్ వదిలిన బాణం.. ఆయన మీదకే వస్తుంది : ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్‌ రెడ్డి

రాష్ట్రం పొత్తులపై తమ అధిష్టానం చూసుకుంటుందని, ఎట్టి పరిస్థితుల్లో వైసీపీతో బీజేపీ పొత్తు ఉండబోదని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Update: 2024-01-06 09:20 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రం పొత్తులపై తమ అధిష్టానం చూసుకుంటుందని, ఎట్టి పరిస్థితుల్లో వైసీపీతో బీజేపీ పొత్తు ఉండబోదని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్‌ రెడ్డి స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొత్తులపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో జగన్ నియంత పాలన కొనసాగిస్తున్నారని ఆక్షేపించారు. ప్రజా వ్యతిరే విధానాలను అవలంభిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దింపేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం యూ టర్న్ తీసుకొని ఆయన మీదకే వస్తుందని ఎద్దేవా చేశారు. ఇటువంటి కోట్ల బోనాలు జగన్మోహన్ రెడ్డి మీద వదలడానికి సిద్ధంగా ప్రజలు ఉన్నారని భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు. జగన్ ఒక్క బాణం ప్రతిపక్షాల మీదకు వదిలితే లక్షలాది బాణాలు సిద్ధంగా ఉన్నాయని హెచ్చిరించారు. 

Tags:    

Similar News