రేపటి నుంచి పది పరీక్షలతో పాటు ఒంటి పూట బడులు: మంత్రి బొత్స సత్యనారాయణ

ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల నిర్వహణ జరగాలని మంత్రిత్వ సత్యనారాయణ పేర్కొన్నారు.

Update: 2023-04-02 07:11 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల నిర్వహణ జరగాలని మంత్రిత్వ సత్యనారాయణ పేర్కొన్నారు. ఒంటిపూట బడులను ప్రైవేట్ స్కూళ్లు కూడా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనం తర్వాత పిల్లలను నేరుగా ఇళ్లకు పంపించాలని తెలిపారు.

టెన్త్ పరీక్ష కేంద్రాలున్న స్కూళ్లకు పూర్తిగా సెలవులు ప్రకటించామని పేర్కొన్నారు. ఈ నెల 3 నుంచి 18 వరకు టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. 3,349 కేంద్రాల్లో 6,64,152 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. బాలురు 3, 11,329 మంది బాలికలు 2,97,741 మంది పరీక్షలు రాయన ఉన్నారని తెలిపారు. 53,410 పది సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు

Tags:    

Similar News