Telugu Poetry: అదే నా ధ్యేయం..
జల జల జారే జలపాతంలా.. గల గల పారే సెలయేరులా..
అదే నా ధ్యేయం..
జల జల జారే జలపాతంలా..
గల గల పారే సెలయేరులా..
ఉరవడిగా పరుగాడే నది ఉప్పెనలా..
గొంతెత్తి అడుగు.. గర్జించి అడుగు..
నిలదీసి అడుగు నిర్మలమైన నా తెలుగు
కనుమరుగౌతున్నది ఎందుకని..
మర్చిపోతున్న నీ మనస్సాక్షినడుగు..
పాల బువ్వలో ప్రేమ కలుపుతూ..
అమ్మ నేర్పిన ఆదిపలుకులు
అంతరించి పోతుంటే
ఆవేశంగా అడుగు నీ అంతరాత్మని..
ఎక్కడెక్కడ తిరిగిన..
ఎన్ని భాషలు నేర్చిన..
అందుకు మూలాధారం తెలుగేనని..
మర్చిపోయిన నీ మేధాశక్తిని..
మందలిస్తూ చెప్పు మరలా ఇలా చెయ్యొద్దని..
తొలిపొద్దులోని నులివెచ్చని కిరణాల
తాకిడికి విరభూసిన..
మంధారపువ్వుల్లో మకరందంలా..
మధురమైన నా తెలుగు..
మరుగునపడుతుంటే..
మనసూరుకోక రాసా ఈ కావ్యం..
మాయమవుతున్న నా మాతృభాష
మరలా అగ్రస్థానంలో
నిలవాలన్నదే నా ధ్యేయం..
#ఇంద్రజ.గడిపర్తి#
7036951018